![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, `సుప్రీమ్` హీరో సాయితేజ్ తమ్ముడిగా తెరంగేట్రం చేశాడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా `ఉప్పెన`తోనే సంచలన విజయం అందుకున్న ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో.. త్వరలో తన సెకండ్ వెంచర్ `కొండ పొలం`తో పలకరించబోతున్నాడు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ప్రసిద్ధ నవల `కొండ పొలం` ఆధారంగా రూపొందిన ఈ అడ్వెంచసరస్ మూవీని వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించాడు. రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించిన ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్లు ఈ రోజు రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనౌన్స్ చేసింది యూనిట్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ చిత్రానికి సరిగ్గా వారం ముందు వైష్ణవ్ తేజ్ అన్న సాయితేజ్ నటించిన `రిపబ్లిక్` రిలీజ్ కాబోతోంది. `ప్రస్థానం` ఫేమ్ దేవా కట్టా రూపొందించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ పంజా అభిరామ్ గా నటించాడు సాయితేజ్. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 1న తెరపైకి రానుంది. మరి.. సరిగ్గా వారం వ్యవధిలో అవార్డ్ విన్నింగ్ చిత్రాల దర్శకులు, సంగీత దర్శకుల కాంబినేషన్ లో చేసిన సినిమాలతో వస్తున్న `పంజా` బ్రదర్స్.. ఈ ఆసక్తికరమైన పోటీలో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.
![]() |
![]() |