![]() |
![]() |
.jpg)
పూరి జగన్నాథ్ రూపొందించిన 'ఇడియట్' సినిమాలో రవితేజ జోడీగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రక్షిత, తొలి సినిమాతోటే తెలుగువారిని ఆకట్టుకున్నారు. ఆమె చలాకీ నటన ప్రేక్షకుల్ని అలరించారు. దాని తర్వాత పెళ్లాం ఊరెళితే, నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు చిత్రాల్లో నటించారు. ఆమె తెలుగులో చేసిన చివరి సినిమా 'జగపతి'. 2007లో కన్నడ దర్శకుడు ప్రేమ్‌ను వివాహం చేసుకున్నాక, ఆమె నటనకు దూరమయ్యారు. అయితే సినిమా ఇండస్ట్రీకి ఆమె దూరం కాలేదు. నిర్మాతగా మారి, కన్నడంలో శివ రాజ్‌కుమార్ హీరోగా 'జోగయ్య' సినిమాను నిర్మించారు. భర్త ప్రేమ్ హీరోగా నటించిన 'డీకే' సినిమాకు ఆమే నిర్మాత.
ఇప్పుడు భర్త దర్శకత్వంలో 'ఏక్ లవ్ య' అనే మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఓ స్పెషల్ రోల్ పోషించారు. పద్నాలుగేళ్ల తర్వాత ఆమె కెమెరా ముందుకు వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమా షూటింగ్ చివరి రోజుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు.
"ఈరోజు మా ఫిల్మ్ ]ఏక్ లవ్ య] చివరి రోజు షూట్. ముత్తతిలో లాస్ట్ షాట్ తీశాం. అక్కడి ఆంజనేయస్వామి టెంపుల్‌లో పూజ చేశాం. చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో సాయపడిన ప్రతి టెక్నీషియన్, యాక్టర్, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. పనిమీద అద్భుతమైన శ్రద్ధ, తపన ఉన్న టీమ్ మెంబర్స్ వల్ల ఈ అందమైన జర్నీ సాధ్యపడింది. త్వరలో దీన్ని విడుదల చేస్తామని ఆశిస్తున్నాం. 'ఏక్ లవ్ య'ను తీసేటప్పుడు మేమెంతగా ఎంజాయ్ చేశామో, సినిమా చూసే మీరందరూ అలాగే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎప్పుడూ మంచి సినిమాలే తియ్యాలని కోరుకుందాం." అంటూ ఆమె రాసుకొచ్చారు.
.jpg)
రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందుతోన్న 'ఏక్ లవ్ య'లో రక్షిత తమ్ముడు రాణా హీరోగా నటిస్తున్నాడు. అతని అసలు పేరు అభిషేక్ రావ్. రీష్మా, రచితా రామ్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీ రక్షిత ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాణమవుతోంది.
.jpg)
.jpg)
![]() |
![]() |