![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ.. ఇలా ఈ జనరేషన్ స్టార్స్ అందరితోనూ జోడీకట్టి నంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా. అయితే, ఎటొచ్చి సీనియర్ స్టార్స్ కి మాత్రం ఆమె జంటగా నటించలేదు. కాగా, త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఓ మాస్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రంలో ఇద్దరు నాయికలకు స్థానముందట. అందులో ఒకరిగా ఇలియానాని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట అనిల్. అదేగనుక నిజమైతే.. బాలయ్యతో ఇలియానా రొమాన్స్ చేసే మొదటి చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో మూవీలో ఇలియానా ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
ఇదిలా ఉంటే.. రవితేజ హీరోగా నటిస్తున్న `రామారావు ఆన్ డ్యూటీ`లో ఇలియానా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఇప్పటివరకు యూనిట్ ఈ విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
![]() |
![]() |