![]() |
![]() |

వెర్సటైల్ డైరెక్టర్ క్రిష్ రూపొందించిన `ఎన్టీఆర్ కథానాయకుడు`(2019)లో అతిలోక సుందరి శ్రీదేవిగా అతిథి పాత్రలో దర్శనమిచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. కట్ చేస్తే.. రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో ఓ పూర్తిస్థాయి సినిమా చేసిందీ అమ్మడు. అంతేకాదు.. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతోంది రకుల్.
`ఉప్పెన` ఫేమ్ వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ప్రసిద్ధ నవల `కొండపొలం` ఆధారంగా తెరకెక్కింది. చాలా రోజుల క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రం కావడంతో.. ఆ పనులకే అధిక సమయం కేటాయిస్తూ వస్తోంది యూనిట్.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `కొండపొలం` చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల చేయాలని క్రిష్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. అక్టోబర్ 10 రకుల్ పుట్టినరోజు. సో.. తన బర్త్ డేకి రెండు రోజుల ముందు ఈ సినిమా రిలీజ్ కానుందన్నమాట. మరి.. ఈ బర్త్ డే స్పెషల్ మూవీ రకుల్ కి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తుందో చూడాలి.
![]() |
![]() |