![]() |
![]() |

సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు (ఐవీఎన్ఆర్) మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. మీనాక్షి చౌధరి హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఎస్. దర్శన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మించారు. ఐవీఎన్ఆర్‌ను ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఇదివరకే వారు ప్రకటించారు.
నిజ ఘటనల ప్రేరణతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని డైరెక్టర్ దర్శన్ రూపొందించాడు. వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అదే తరహాలో ఒక వైవిధ్యమైన పాయింట్‌తో థ్రిల్లర్‌గా తయారైన మా సినిమాను వారు ఆదిరిస్తారని ఆశిస్తున్నాం అని దర్శక నిర్మాతలు తెలిపారు.
వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం ప్రేక్షకులకు నవ్వులను పంచనున్న ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చగా, ఎం. సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. రియల్ సతీశ్ కొరియోగ్రఫీ అందించిన యాక్షన్ సీన్లు సినిమాకు ఎస్సెట్‌గా నిలువనున్నాయి.
![]() |
![]() |