![]() |
![]() |

ఈ ఏడాది సంక్రాంతికి `క్రాక్`తో సందడి చేశారు మాస్ మహారాజా రవితేజ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ పవర్ ఫుల్ కాప్ డ్రామా.. రవితేజ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. `క్రాక్` అఖండ విజయంతో.. రవితేజ తదుపరి చిత్రం `ఖిలాడి`పై మంచి అంచనాలే నెలకొన్నాయి. `రాక్షసుడు` ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజకి జంటగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. మే 28న విడుదల కావాల్సిన `ఖిలాడి` కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా తాలూకు చిత్రీకరణ తుది దశకు చేరుకున్నా.. రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సెప్టెంబర్ లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగినా.. యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. దీపావళి కానుకగా `ఖిలాడి`ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఇప్పటికే దీపావళి బరిలో సూపర్ స్టార్ రజినీకాంత్ `అణ్ణాత్తే`, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ `గని` చిత్రాలు ఉన్నాయి. ఒకవేళ.. `ఖిలాడి` కూడా అదే సీజన్ కి కన్ఫామ్ అయితే.. త్రిముఖ పోటీ తప్పదన్నమాట. చూద్దాం.. ఏం జరుగుతుందో?
![]() |
![]() |