![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. అంతేకాదు.. దసరా సీజన్ లో ఈ చిత్రం రిలీజ్ కానుందని బజ్.
ఇదిలా ఉంటే.. అదే విజయదశమి పర్వదినం సమయంలోనే తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించడానికి బాలయ్య ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `క్రాక్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ వెంచర్ ని బాలకృష్ణతో చేయబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ తాలూకు షూటింగ్ ని దసరా సందర్భంగా ప్రారంభించనున్నారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. అక్టోబర్ 15న ఈ చిత్రానికి ముహూర్తం కుదిరిందని తెలిసింది. త్వరలోనే బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్ మూవీకి సంబంధించి వస్తున్న ఈ వార్తలపై క్లారిటీ రానుంది.
కాగా, ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించనున్నాడు. 2022 వేసవిలో బాలయ్య- గోపీచంద్ ఫస్ట్ జాయింట్ వెంచర్ థియేటర్స్ లోకి వచ్చే అవకాశముందంటున్నారు.
![]() |
![]() |