![]() |
![]() |

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ` చేస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ డ్రామా.. చిత్రీకరణ తుది దశలో ఉంది. దసరా సీజన్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. కాగా, `అఖండ` విడుదలయ్యేలోపే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు బాలయ్య. అంతేకాదు.. గోపీచంద్ డైరెక్టోరియల్ నిర్మాణ దశలో ఉండగానే అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకెళతారని బజ్.
ఇదిలా ఉంటే.. బాలయ్య ఏజ్, ఇమేజ్ కి తగ్గట్టు అనిల్ చేయనున్న ఈ సినిమాలో మరో హీరో పాత్రకి కూడా స్థానముందట. కాకపోతే, అది అతిథి తరహా వేషమని వినికిడి. ఇందులో మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్ నటించే అవకాశముందంటున్నారు. గతంలో అనిల్ డైరెక్ట్ చేసిన `సుప్రీమ్`(2016) చిత్రంలో సాయితేజ్ కథానాయకుడిగా నటించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఈ ఇద్దరు కలిసి పనిచేసింది లేదు. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత బాలయ్య సినిమా కోసం ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. మరి.. బాలకృష్ణ చిత్రంలో సాయితేజ్ అతిథిగా నటిస్తాడో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, సాయితేజ్ తాజా చిత్రం `రిపబ్లిక్`.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ పంజా అభిరామ్ పాత్రలో నటించాడు సాయితేజ్.
![]() |
![]() |