![]() |
![]() |

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా రూపొందుతోంది. ‘అతడు’ వంటి క్లాసిక్, ‘ఖలేజా’ వంటి ఇమేజ్ ఛేంజోవర్ సినిమాలు చేశాక... సుమారు పదకొండేళ్ల విరామం తర్వాత ఇద్దరూ చేస్తున్న చిత్రమిది. ఇందులో పూజా హెగ్డేను కథానాయికగా ఎంపిక చేశారు. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాకుండా, సెకండ్ హీరోయిన్‌కు చోటు ఉంటుంది. ఒక్కోసారి కీలక పాత్రలకు వేలుగులోకి వస్తున్న ప్రతిభావంతులైన కథానాయికలను తీసుకుంటారు. అందువల్లనో, ఏమో... మహేష్28 సినిమాలో ‘వకీల్ సాబ్’ ఫేమ్ అనన్యా నాగళ్లకు అవకాశం వచ్చిందనే వార్త చక్కర్లు కొడుతోంది.
‘మల్లేశం’ సినిమాతో వెలుగులోకి వచ్చిన తెలుగమ్మాయి అనన్యా నాగళ్ల. ‘ప్లేబ్యాక్’లో లీడ్ రోల్ చేసింది. ‘వకీల్ సాబ్’లో ప్రధాన పాత్రధారులైన ముగ్గురమ్మాయిల్లో ఒకరిగా నటించింది. ఇప్పుడు మహేష్28లో ఆమెకు ఛాన్స్ వచ్చిందనే వార్త చక్కర్లు కొడుతుండటంతో అందరూ ఆమెకు ఫోనులు చేసి అభినందిస్తున్నారు. అయితే, ‘‘నేను ఆ సినిమాలో లేను. ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే నేను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తా. ఆ సినిమా గురించి అడగటానికి అయితే తనకు ఫోన్స్ చెయ్యవద్దు’’ అని అనన్యా నాగళ్ల సున్నితంగా చెబుతున్నారట.
![]() |
![]() |