![]() |
![]() |

రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్.. తెలుగునాట స్టార్ హీరోలందరికీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందించిన అగ్ర సంగీత దర్శకుడు. అంతేకాదు.. దాదాపు స్టార్స్ అందరితోనూ ఒకటికి మించి సినిమాలు చేసిన వైనం డీఎస్పీ సొంతం. అయితే, నటసింహం నందమూరి బాలకృష్ణతో మాత్రం ఇప్పటివరకు కేవలం ఒక చిత్రం మాత్రమే చేశాడీ స్టార్ కంపోజర్. ఆ సినిమానే.. `లెజెండ్` (2014).
`లెజెండ్` విడుదలై ఏడేళ్ళు దాటినా.. బాలయ్యతో మరో సినిమా చేయలేదు దేవి శ్రీప్రసాద్. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. త్వరలోనే నటసింహంతో మరోసారి జట్టుకట్టనున్నాడట రాక్ స్టార్. ఆ వివరాల్లోకి వెళితే.. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో బాలయ్య ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బాణీలు కట్టే అవకాశం డీఎస్పీకి దక్కిందని సమాచారం. `ఎఫ్ 2`, `సరిలేరు నీకెవ్వరు`, `ఎఫ్ 3`.. ఇలా తన వరుస చిత్రాలకు స్వరాలు సమకూర్చుతూ వస్తున్న దేవి శ్రీప్రసాద్ నే.. బాలయ్య కాంబో మూవీకి కూడా కొనసాగించబోతున్నాడట అనిల్ రావిపూడి.
మరి.. `లెజెండ్` తరువాత బాలకృష్ణ సినిమాకి సంగీతమందించనున్న డీఎస్పీ.. మరోసారి అదే స్థాయి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |