![]() |
![]() |

మాస్ మహరాజా రవితేజకి అచ్చొచ్చిన దర్శకుల్లో శ్రీను వైట్ల ఒకరు. రవితేజ తొలిసారి సోలో హీరోగా నటించిన `నీ కోసం` (1999)తోనే శ్రీను వైట్ల దర్శకుడిగా మొదటి అడుగేయగా.. ఆపై `వెంకీ` (2004), `దుబాయ్ శీను` (2007), `అమర్ అక్బర్ ఆంటొని` (2018) చిత్రాలు వీరి కాంబినేషన్ లో వచ్చాయి. వీటిలో `అమర్ అక్బర్ ఆంటొని` మాత్రమే నిరాశపరిచింది.
ఇదిలా ఉంటే.. త్వరలో రవితేజ, శ్రీను వైట్ల మరోసారి జట్టుకట్టనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ మేరకు ఇద్దరి మధ్య కథాచర్చలు కూడా జరుగుతున్నాయని టాక్. అంతేకాదు.. రవితేజ ఏజ్, ఇమేజ్ కి తగ్గట్టుగా శ్రీనువైట్ల ఈ స్టోరీ డిజైన్ చేశారని అంటున్నారు. త్వరలోనే రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది. మరి.. ఐదోసారి జట్టుకడుతున్న రవితేజ, శ్రీను వైట్ల.. ఈ సారి ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాలి.
కాగా, రవితేజ ప్రస్తుతం `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇందులో `ఖిలాడి` చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. `రామారావు ఆన్ డ్యూటీ` ఇటీవలే పట్టాలెక్కింది. ఇక శ్రీను వైట్ల విషయానికి వస్తే.. మంచు విష్ణుతో `డి అండ్ డి`(డబుల్ డోస్) చేస్తున్నారు.
![]() |
![]() |