![]() |
![]() |

`ప్రస్థానం` ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో `సుప్రీమ్` హీరో సాయితేజ్ నటించిన చిత్రం `రిపబ్లిక్`. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ పంజా అభిరామ్ గా దర్శనమివ్వనున్నాడు సాయితేజ్. ఐశ్వర్యా రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో వెటరన్ యాక్టర్స్ జగపతి బాబు, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు అందించిన ఈ చిత్రాన్ని తొలుత జూన్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా వేశారు. తాజాగా.. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి వారాంతం స్పెషల్ గా అక్టోబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఇదే అక్టోబర్ 1న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో మ్యాచో స్టార్ గోపీచంద్ తొలిసారిగా నటిస్తున్న `పక్కా కమర్షియల్` చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణలో జాప్యం జరగడంతో ఇప్పుడా ప్లాన్ ని విరమించుకున్నారని టాక్. సో.. గోపీచంద్ మిస్ అయిన డేట్ కి సాయితేజ్ ఎస్ అంటూ రాబోతున్నాడన్నమాట. మరి.. బడా మల్టిస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`కి 12 రోజుల ముందు రాబోతున్న సాయితేజ్.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |