![]() |
![]() |

మొన్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు, నిన్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, నేడు? పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్! అఫీషియల్ టైమ్ కంటే ముందే కొత్త టీజర్లు, సాంగ్స్‌తో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలోకి, నెట్టింట్లోకి వచ్చారు. అదీ వాళ్ళకు తెలియకుండా! రీసెంట్‌గా స్టార్స్ టీజర్లు, సాంగ్స్, స్టిల్స్ లీకైన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా పవన్ కొత్త సినిమా టీజర్, అందులో స్టిల్స్ లీకయ్యాయి.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా హీరోలుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా టైటిల్‌ను ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9.45 గంటలకు విడుదల చెయ్యడానికి డిసైడ్ అయ్యారు. సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ పేరు భీమ్లా నాయక్‌ను టైటిల్‌గా కన్ఫర్మ్ చేసినట్టు న్యూస్. అలాగే, టీజర్ కూడా లీకైంది. ప్రివ్యూ కోసం ఎవరికో యూనిట్ సభ్యులు పంపగా, దాన్ని లీక్ చేశారు. అయితే, టీజర్ మొత్తం లీక్ కాలేదు. అందులో కొంత మాత్రమే లీక్ అయ్యింది. ముఖ్యంగా టీజర్‌లో పవన్ లుక్‌ను లీక్ చేశారు.
టైటిల్, పవన్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసినప్పుడు ఒక ప్రీ–లుక్ రిలీజ్ చేశారు. అందులో పవన్ లుంగీ కట్టుకోగా, వెనుక నుంచి చూపించారు. లీక్డ్ స్టిల్స్‌లో పవన్ ఫ్రంట్ లుక్ ఉంది. వాటిని బట్టి ఒక ఫైట్, పవర్‌ఫుల్ డైలాగ్ టీజర్‌లో యాడ్ చేసినట్టు తెలుస్తోంది. అగ్రెస్సివ్‌గా పవన్ డైలాగ్ చెబుతుంటే, నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పినట్టు అభిమానులకు పూనకాలు రావడం గ్యారెంటీ అనుకోవాలి.
![]() |
![]() |