![]() |
![]() |

ఆదివారం జరగబోయే పాపులర్ సింగింగ్ రియాలిటీ షో ‘‘ఇండియన్ ఐడల్ 2021’’ గ్రాండ్ ఫినాలేలో ఫైనలిస్ట్ గా పోటీచేస్తున్న తెలుగమ్మాయి షణ్ముఖప్రియకు హీరో విజయ్ దేవరకొండ వీడియా ద్వారా బెస్ట్ విషెస్ అందించి సర్‌ప్రైజ్ చేశాడు. ఇండియన్ ఐడల్ షోలో ఓ తెలుగమ్మాయి ఫైనల్ చేరుకోవడం ఇదే మొదటిసారి. తను ‘విజయ్ దేవరకొండకు పెద్ద ఫ్యాన్ అనీ, విజయ్ సినిమాలో పాడటమే తన కోరిక అని ఇంతకు ముందు షో నిర్వాహకులకు తెలిపింది. అందుకే సోనీ టీవి వాళ్లు విజయ్ ను షణ్ముఖకు విషెస్ తెలపాలని కోరారు.
వెంటనే విజయ్ దేవరకొండ ఓ వీడియోతో ప్రోగ్రామ్ జరగుతున్నప్పుడే షణ్ముఖప్రియను సర్‌ప్రైజ్ చేశాడు.తనకు ఆల్ ది బెస్ట్ చెప్పడమే కాకుండా, టైటిల్ గెలిచినా, గెలవకపోయినా.. తన నెక్స్ట్ సినిమాలో పాడే అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఈ వీడియో చూడగానే షణ్ముఖప్రియ, ఆమె పేరెంట్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయింది. షోలో ఉన్న కంటెస్టెంట్ లు, గెస్ట్ లు, ప్రేక్షకులు అంతా షణ్ముఖకు విజయ్ ఆఫర్ ఇవ్వటాన్ని అభినందించారు.
![]() |
![]() |