![]() |
![]() |

వైవిధ్యభరితమైన పాత్రలతో ముందుకు సాగుతున్న విజయ్ సేతుపతి, తాప్సీ.. ఓ తమిళ సినిమా కోసం కలిసి నటించిన సంగతి తెలిసిందే. `అన్నాబెల్లి సుబ్రమణ్యం` పేరుతో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కొన్ని కారణాల వల్ల టైటిల్ ని మార్చే దిశగా యూనిట్ ప్లాన్ చేస్తోందట.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అటు విజయ్ సేతుపతి, ఇటు తాప్సీ.. ఇద్దరు కూడా ద్విపాత్రాభినయం చేశారట. వీరి ద్విపాత్రాభినయమే చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని సమాచారం. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇంతవరకు విజయ్ సేతుపతి, తాప్సీ ఇద్దరు కూడా డ్యూయెల్ రోల్స్ లో నటించిన సందర్భాలు లేవనే చెప్పాలి. ఆరకంగా.. ఈ టాలెంటెడ్ యాక్టర్స్ కి ఈ సినిమా వెరీ స్పెషల్ అనే చెప్పాలి. మరి.. డబుల్ రోల్స్ లో విజయ్, తాప్సీ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ప్రధానంగా తమిళంలో తెరకెక్కిన `అన్నాబెల్లి సుబ్రమణ్యం`.. విజయ్, తాప్సీకి జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు కారణంగా పలు భాషల్లో అనువాద రూపంలోనూ ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.
![]() |
![]() |