![]() |
![]() |

కొవిడ్–19 సెకండ్ వేవ్ తర్వాత వారానికి కనీసం అరడజను సినిమాలు రిలీజవుతున్నాయి. అయితే, వాటిలో ఏ సినిమా చూడాలనే క్వశ్చన్ గానీ, కన్‌ఫ్యూజన్ గానీ ఆడియన్స్‌కు ఎదురు కాలేదు. ఎందుకంటే... ఓ మాదిరి స్టార్లున్న సినిమా వారానికి ఒక్కటే వచ్చింది. తొలుత ‘తిమ్మరుసు’, తర్వాత ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ఈవారం ‘పాగల్’ – ఇలా బజ్ తెచ్చుకున్నాయి. ‘ఇష్క్’ రిలీజ్‌కు ముందు బజ్ వచ్చినా మొదటిరోజు నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ‘తిమ్మరుసు’కు లైన్ క్లియర్ అయ్యింది. అయితే, ఈ నెలాఖరున... ఆగస్టు 27వ తేదీన థియేటర్ల దగ్గర ఓ మాదిరి స్టార్లున్న చిన్న సినిమాల మధ్య పెద్ద యుద్ధం చోటు చేసుకోబోతోంది.
ఆగస్టు 19న శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’, శ్రీవిష్ణు–మేఘా ఆకాష్ జంటగా నటించిన ‘రాజ రాజ చోర’ రిలీజవుతున్నాయి. ఎలాగో చిన్న సినిమాలు ఉంటాయి. అయితే, ఆ తర్వాత ఆగస్టు 27న ప్రస్తుతానికి మూడు సినిమాలు కర్చీఫ్‌లు వేశాయి.
మహేష్‌బాబు బావమరిది సుధీర్‌బాబు హీరోగా నటించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. దీనిని ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్టు గురువారం అనౌన్స్ చేశారు. అదే డేట్‌కు థియేటర్లలోకి వస్తున్నట్టు శుక్రవారం మరో రెండు సినిమాలు అనౌన్స్ చేశాయి. అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన ‘101 జిల్లాల అందగాడు’ను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నారు. అలాగే, ఏయన్నార్ మనవడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్ సినిమా ‘ఇచట వాహనములు నిలుపరాదు’ కూడా సేమ్ డేట్‌కు వస్తోంది.
వీటికి మల్టీప్లెక్స్‌లలో బాలీవుడ్ సినిమా ‘చెహరే’ నుండి కాంపిటీషన్ ఎదురు కానుంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మీ మెయిన్ రోల్స్ చేసిన ఆ సినిమాకు హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లలో చెప్పుకోదగ్గ స్ర్కీన్లు లభించే ఛాన్స్ ఉంది. వీటిలో ఏ సినిమాకు వెళ్లాలనే క్వశ్చన్ ఆడియన్స్‌కు ఎదురవడం ఖాయం.
![]() |
![]() |