![]() |
![]() |

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌కు దూరంగా ఉండాలని డెసిషన్ తీసుకున్నారు. త్వరలో ట్విట్టర్‌కు గుడ్‌బై చెప్పేస్తానని శనివారం ఉదయం ఆయనో ట్వీట్ చేశారు. ‘‘నో కాంట్రవర్సీస్. నా జీవితంలో ఎటువంటి వివాదాలు నాకు వద్దు’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. అంతకు మించి ఇతర వివరాలు ఏవీ వెల్లడించలేదు.
బండ్ల గణేష్ తనకు తాను పవన్‌కల్యాణ్ భక్తుడు అని ప్రకటించుకున్నారు. సినిమా ఫంక్షన్లు, సోషల్ మీడియాలో పవన్ గురించి బండ్ల చెప్పే మాటలు ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడేలా చేశాయి. దాంతో వాళ్ళందరూ బండ్ల గణేష్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటో తెలియక ట్విట్టర్‌లో ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. బండ్ల గణేష్ ట్వీట్ కింద ‘అన్నా... ఏమైంది?’, ‘వాట్ హ్యాపెన్డ్’ అనే రిప్లైలు ఎక్కువ కనిపిస్తున్నాయి.

నటుడిగా మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు'లో బ్లేడు బాబ్జీగా కనిపించాక మళ్లీ తెరపై ఆయన కనిపించలేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన 'టెంపర్' తర్వాత మళ్లీ నిర్మాత అవతారం ఎత్తలేదు. వ్యాపారాలు చూసుకుంటూ వస్తున్నారు.
![]() |
![]() |