![]() |
![]() |

మెలోడీబ్రహ్మ మణిశర్మ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన చిత్రంగా `చూడాలని వుంది!`(1998)కి ప్రత్యేక స్థానం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. మణిశర్మకి `ఉత్తమ సంగీత దర్శకుడు`గా అటు ఫిల్మ్ ఫేర్, ఇటు నంది అవార్డులను అందించింది. ఇలా.. అన్ని రకాలుగా మణిశర్మకి మరపురాని జ్ఞాపకంగా నిలిచిందీ సినిమా. అందుకే.. `చూడాలని వుంది!` విడుదలైన ఆగస్టు 27వ తేది ఈ మెలోడీబ్రహ్మకి ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.
అలాంటి ఆ తేదిన ఏడాది తరువాత వచ్చిన `శీను` (1999) కూడా మణిశర్మకి స్వరకర్తగా మంచి పేరు తీసుకువచ్చింది. విక్టరీ వెంకటేశ్ నటించిన ఈ రీమేక్.. కమర్షియల్ గా నిరాశపరిచినా మ్యూజికల్ గా మాత్రం సెన్సేషనే. కట్ చేస్తే.. 22 ఏళ్ళ తరువాత మణిశర్మ లక్కీ డేట్ కి మరో సినిమా రిలీజ్ కాబోతోంది. అదే.. `శ్రీదేవి సోడా సెంటర్`. సుధీర్ బాబు, ఆనంది జంటగా `పలాస` ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ ఆగస్టు 27న విడుదల కానుంది. ``మందులోడా``, `` నాలో ఇన్నాళ్ళుగా``.. ఇలా ఇప్పటివరకు రిలీజైన ఇందులోని రెండు పాటలు కూడా సంగీతప్రియులను ఆకట్టుకున్నాయి. మరి.. తన కెరీర్ ని మేలి మలుపు తిప్పిన తేదిన ముచ్చటగా మూడోసారి పలకరిస్తున్న వైనం మణిశర్మకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
![]() |
![]() |