![]() |
![]() |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కథానాయకుడిగా ఓ బైలింగ్వల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. `పందెం కోడి` ఫేమ్ లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రామ్ కి జోడీగా `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి నాయికగా నటిస్తోంది. ఆది పినిశెట్టి, నదియా ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
ఇదిలా ఉంటే.. కథానుసారం ఈ మాస్ ఎంటర్టైనర్ లో ఓ ఐటమ్ సాంగ్ కి స్థానముందట. ఊరమాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కే ఈ పాటలో ఓ పాపులర్ హీరోయిన్ మెరుస్తుందని టాక్. త్వరలోనే ఆ నాయిక ఎవరో క్లారిటీ వస్తుంది. మరి.. ఊరమాస్ ఐటమ్ నంబర్ పై వస్తున్న కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొద్ది రోజులు వేచిచూడాల్సిందే. కాగా, 2022 ఆరంభంలో ఈ పేరు నిర్ణయించని ద్విభాషా చిత్రం తెరపైకి రానుంది.
`ఇస్మార్ట్ శంకర్` తరువాత వచ్చిన `రెడ్`.. రామ్ కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో.. ఈ బైలింగ్వల్ మూవీ రిజల్ట్ తనకి ఎంతో కీలకంగా మారింది.
![]() |
![]() |