![]() |
![]() |
.jpg)
లీకురాయుళ్లు రెచ్చిపోతున్నారు. నలభై సెకన్ల ప్రచార చిత్ర్రమని చూడటం లేదు. నాలుగు నిమిషాల పాట అని క్షమించడం లేదు. ఆఖరికి సెట్స్‌లో హీరో స్టయిలిష్ వాక్ అని దాచడం లేదు. అన్నిటినీ నెట్టింట్లో వదిలేస్తున్నారు. అధికారికంగా చిత్ర బృందాలు విడుదల చేసే వరకు వెయిట్ చేయకుండా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దాంతో యూనిట్ సభ్యులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
మొన్నటికి మొన్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలని 'సర్కారు వారి పాట' టీమ్ బర్త్‌డే బ్లాస్టర్ రెడీ చేసింది. మార్నింగ్ రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ, అర్ధరాత్రి టీజర్ లీక్ కావడంతో అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. చాలామందికి చెప్పిన టైమ్ కంటే ముందు ఎందుకు రిలీజ్ చేశారో అర్థం కాలేదు.
ఈమధ్య కాలంలో లీకుల బెడదను ఎక్కువగా ఎదుర్కొంటున్న హీరో ప్రభాస్. షూటింగ్ స్పాట్స్ నుండి అతడి లుక్స్ లీక్ అవుతున్నాయి. ఎక్కడ 'సలార్' షూటింగ్ చేసినా ప్రభాస్ వర్కింగ్ స్టిల్స్ లీక్ కావడం కామన్ అయ్యింది.
లేటెస్ట్‌గా లీకువీరుల చేతికి 'పుష్ప' ఫస్ట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక... పులొచ్చి కొరుకుద్ది పీక' చిక్కింది. వెంటనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించారు. శుక్రవారం ఉదయం విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, అంతకంటే ముందు గురువారం అర్ధరాత్రి నెట్టింట్లో తెలుగు వెర్షన్ సాంగ్ విడుదలైంది. అది ఒరిజినల్ కాదు. దేవిశ్రీ ప్రసాద్ పాడిన రఫ్ ట్రాక్. సినిమాలో గాయకుడు శివమ్ చేత దేవిశ్రీ పాడించాడు. అతడితో పాడించడానికి ముందు యూనిట్ సభ్యులకు పాట ఎలా ఉంటుందో చూపించడానికి దేవిశ్రీ పాడినట్టు ఉన్నాడు. అది ఇప్పుడు లీక్ అయ్యింది.
![]() |
![]() |