![]() |
![]() |

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన భర్త కోరితే నటనకు గుడ్ చెప్తానంటూ షాక్ ఇచ్చింది.
కాజల్ గత ఏడాది ముంబైకు చెందిన పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ అలరిస్తున్న కాజల్.. తాజాగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చే కామెంట్స్ చేసింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన కాజల్.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "నేను ఎంతకాలం సినీ రంగంలో కొనసాగుతానో నాకు తెలియదు. సినీ రంగం నుంచి తప్పుకోవాలని నా భర్త కోరిన మరుక్షణమే నటనకు గుడ్ బై చెప్తాను. నా భర్త మాటకు విలువ ఇచ్చేలా నడుచుకుంటాను" అని కాజల్ తెలిపింది.
కాజల్ ప్రస్తుతం చిరంజీవి సరసన 'ఆచార్య'లో నటిస్తోంది. నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీలోనూ నటిస్తోంది. అలాగే 'ఇండియన్ 2'తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
![]() |
![]() |