![]() |
![]() |

నటుడు మాధవన్ ఇటీవల దుబాయ్ ప్రయాణంలో తనకు ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని బుధవారం తన ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. విమానం మొత్తం మీద సిబ్బంది మినహా తనొక్కడే ప్రయాణం చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన కొన్ని వీడియోల ద్వారా ఆయన తెలియజేశాడు!
ఆయన షేర్ చేసిన వీడియోలన్నీ జూలై 26న తీసినవి. మొదటి వీడియోలో విమానంలో మాధవన్ నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపించాడు. ఫ్లయిట్ మొత్తం కెమెరాను తిప్పి చూపించాడు. ఆయన తప్ప మరో ప్యాసింజర్ ఎవరూ అందులో లేరు. ఫ్లయిట్ అటెండెంట్ వాయిస్ మాత్రం వీడియోలో వినిపించింది. కెమెరా వంక చూసి మాట్లాడుతూ, "నా లైఫ్‌లో ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం కాబోతోంది" అని చెప్పాడు. ఆ తర్వాత ఆయన బిజినెస్ క్లాస్ వద్దకు వెళ్లాడు. అది కూడా పూర్తి ఖాళీగా ఉంది.
ఫ్లయిట్‌లోనే కాకుండా, ఎయిర్‌పోర్ట్‌లో ఎలా ఉందో కూడా మాధవన్ చూపించాడు. అది కూడా నిర్మానుష్యంగా కనిపించింది. లాంజ్ ఏరియా, వెయిటింగ్ రూమ్‌లు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ వీడియోలను షేర్ చేసి, "2021 జూలై 26.. విచిత్రంగా అనిపించింది, దాంతో పాటు దిగులుగా కూడా. త్వరలోనే ఈ పరిస్థితి ముగియాలని గట్టిగా ప్రార్థిస్తున్నాను. అప్పుడే ఇష్టమైన వ్యక్తులు ఒకరితో ఒకరు కలిసుంటారు" అని రాసుకొచ్చాడు. 'అమెరికి పండిట్' సినిమా షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నట్లు ఆయన వెల్లడించాడు.
![]() |
![]() |