![]() |
![]() |

కోలీవుడ్ స్టార్ ధనుష్ - సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో ధనుష్ ఓ మదరాసి తెలుగు నాయకుడిగా దర్శనమివ్వబోతున్నాడట. అంతేకాదు.. 1950ల కాలం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పిరియడ్ డ్రామా సాగుతుందని.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు నాటి కల్పితగాథతో ఈ భారీ బడ్జెట్ వెంచర్ రూపొందనుందని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, శేఖర్ కమ్ముల తాజా చిత్రం `లవ్ స్టోరి` విడుదలకు సిద్ధమైంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్.. అక్టోబర్ లో రిలీజ్ కానుందని టాక్. ఇక ధనుష్ విషయానికి వస్తే.. `ద గ్రే మ్యాన్` (హాలీవుడ్), `అత్రంగి రే` (బాలీవుడ్) చిత్రాలను పూర్తిచేసి `మారన్`, `తిరుచిత్రంబలం` (తమిళ్) సినిమాలతో బిజీ అయిపోయాడు.
![]() |
![]() |