![]() |
![]() |
.jpg)
సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా మహేశ్ - జక్కన్న ఫస్ట్ జాయింట్ వెంచర్ తెరకెక్కనుందని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ 2022 వేసవిలో ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు.. మహేశ్ ఇండస్ట్రీ హిట్ `పోకిరి` (2006), రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ ఇండస్ట్రీ హిట్ `బాహుబలి - ది కంక్లూజన్` (2017) విడుదలైన ఏప్రిల్ 28ని లాంచింగ్ డేట్ గా లాక్ చేశారని బజ్. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.
కాగా, రాజమౌళి తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. ఇక మహేశ్ విషయానికి వస్తే.. తన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ `సర్కారు వారి పాట` 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించబోతున్న కొత్త సినిమా.. అతి త్వరలో పట్టాలెక్కి 2022 వేసవిలో వినోదాలు పంచనుంది.
![]() |
![]() |