![]() |
![]() |

తెలుగమ్మాయి అంజలి.. పాన్ - ఇండియా మూవీలో నటించబోతోందా? అవునన్నదే తమిళ చిత్ర వర్గాల గుసగుస.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఓ భారీ బడ్జెట్ మూవీని రూపొందించనున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. సెప్టెంబర్ 8 నుంచి సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. కాగా, ఈ చిత్రంలో చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఎంపికైన సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. కథానుసారం ఇందులో మరో నాయిక పాత్రకి స్థానం ఉందని.. అందులో అంజలి నటించబోతోందని వినికిడి. తెలుగు, తమిళ భాషల్లో అంజలికి నటిగా మంచి గుర్తింపే ఉంది. ఈ నేపథ్యంలోనే.. అంజలిని అభినయానికి ఆస్కారమున్న సెకండ్ లీడ్ కి శంకర్ ఎంచుకున్నాడని కోలీవుడ్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. మెగా కాంపౌండ్ ప్రాజెక్ట్స్ లో నటించడం అంజలికి ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `సరైనోడు`లో ఓ ప్రత్యేక గీతం చేసింది అంజలి. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్`లో ముఖ్య పాత్రలో అలరించింది.
![]() |
![]() |