![]() |
![]() |

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'F2'. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా నవ్వులు పూయించింది. కలెక్షన్ల వర్షం కురిపించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా 'F3' రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ, వరుణ్ లు మరింత నవ్వులు పంచనున్నారట.
'F3' లో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్ నటిస్తున్నారని తెలుస్తోంది. రేచీకటితో వెంకీ, నత్తితో వరుణ్.. ఓ రేంజ్ లో నవ్విస్తారట. దీన్ని బట్టి చూస్తుంటే అనిల్ 'F2'ను మించిన 'F3' తో అందించనున్నారని అర్థమవుతోంది. 'F2' మాదిరే 'F3'లో కూడా వెంకీకి జోడీగా తమన్నా, వరుణ్ కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సునీల్, మురళీ శర్మ, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో మురళీ శర్మ హంగామా మామూలుగా ఉండదట. ఆయన ఓ రేంజ్ లో నవ్విస్తారని టాక్.
'F3' సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వచ్చి విజయం సాధించిన 'F2' మాదిరిగానే 'F3' కూడా విజయం అందుకుంటుందేమో చూడాలి.
![]() |
![]() |