![]() |
![]() |

'టైగర్ నాగేశ్వరరావు' అనే ఒక గజదొంగ బయోపిక్ లో బెల్లకొండ శ్రీనివాస్ నటించనున్నట్లు కొద్దిరోజులుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈ బయోపిక్ కి 'స్టూవర్ట్ పురం దొంగ' అనే టైటిల్ ను ఖరారు చేసి.. తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు.
'స్టూవర్ట్ పురం దొంగ' మూవీ ద్వారా ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కేఎస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన దొంగ 'టైగర్' నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది. అందుకే టైటిల్‌కి 'బయోపిక్ ఆఫ్ టైగర్' అనే ట్యాగ్ లైన్ జోడించారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

కాగా, బెల్లంకొండ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.
![]() |
![]() |