![]() |
![]() |

'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కన్నడ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతోంది. యంగ్ కన్నడ హీరో, అప్‌కమింగ్ స్టార్ ధనుంజయతో యాక్ట్ చేసే ఛాన్స్ ఆమెకు దక్కింది. అదీ బెంగళూరు అండర్‌వరల్డ్ ఫస్ట్ మాఫియా డాన్ జయరాజ్ బయోపిక్ కావడంతో పాయల్ ఫుల్ హ్యాపీగా ఉంది.
ఇప్పుడు ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల్లో హీరోలు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు. అలాగే, ధనుంజయ కూడా జయరాజ్ బయోపిక్‌ను పాన్ ఇండియా సినిమాగా తీయాలని స్టార్ట్ చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ క్యాంప్ నుండి వచ్చిన 'భైరవ గీత'తో ఈ హీరో ఒకసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రజెంట్ స్టయిలిష్ స్టార్ 'పుష్ప'లో యాక్ట్ చేస్తున్నాడు. ఆగస్టు మంత్ ఎండ్ నుండి జయరాజ్ బయోపిక్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. అందులో అతడిది డాన్ క్యారెక్టర్.
జయరాజ్ బయోపిక్‌లో పాయల్ రాజ్‌పుత్‌ది క్యాబరే డ్యాన్సర్ రోల్. ఫస్ట్, ఈ ఛాన్స్ వచ్చినప్పుడు తనకు కన్నడ రాదని ఆలోచించిందట. పంజాబీ క్యాబరే డ్యాన్సర్ కావడంతో ఆ క్యారెక్టర్ హిందీ మిక్స్డ్ కన్నడ మాట్లాడుతుందని, భయపడవద్దని యూనిట్ చెప్పడంతో హ్యాపీగా సినిమాకు సైన్ చేసిందట. బయోపిక్ కావడం, అందులోనూ తనది రియల్ లైఫ్ బేస్డ్ రోల్ కావడంతో హోమ్ వర్క్ చేస్తానని పాయల్ చెబుతోంది. మాఫియా డాన్ జయరాజ్ గర్ల్ ఫ్రెండ్ రోల్‌లో, క్యాబరే డ్యాన్సర్‌గా పాయల్ కనిపించనుంది. అన్నట్టు, పాయల్ కూడా పంజాబీ అమ్మాయే. సినిమాలో ఆమె పాత్ర కూడా పంజాబీకి చెందిన క్యాబరే డ్యాన్సర్.
![]() |
![]() |