![]() |
![]() |

మ్యాచో స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా ఫస్ట్ టైమ్ జోడీ కట్టిన చిత్రం `సీటీమార్`. సంపత్ నంది డైరెక్ట్ చేసిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో గోపి, తమన్నా కబడ్డీ కోచ్ లుగా దర్శనమివ్వనున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మెలోడీబ్రహ్మ మణిశర్మ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందించారు.
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన `సీటీమార్` కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే `సీటీమార్` రిలీజ్ డేట్ పై క్లారిటీ రానుంది.
కాగా, గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో `పక్కా కమర్షియల్` చేస్తున్నాడు. రాశీ ఖన్నా నాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే `లక్ష్యం`, `లౌక్యం` చిత్రాల తరువాత శ్రీవాస్ దర్శకత్వంలో గోపి నటించబోతున్న సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక తమన్నా విషయానికి వస్తే.. `ఎఫ్ 3`, `గుర్తుందా శీతాకాలం` చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. మరోవైపు నెగటివ్ రోల్ లో నటించిన `మాస్ట్రో` విడుదలకు సిద్ధమైంది.
![]() |
![]() |