![]() |
![]() |

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'నల్లంచు తెల్లచీర' విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే 'అతడు ఆమె ప్రియుడు' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ సినిమాతో సీనియర్ నటుడు బెనర్జీ హీరోగా ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన బెనర్జీ ఇప్పుడు 'అతడు ఆమె ప్రియుడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదొక బ్లాక్ హ్యూమర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమా. ఇందులో ఆయన ఒక ఆస్ట్రానమీ ప్రొఫెసర్ గా నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ప్రారంభమయ్యయి. ఈ సినిమా గురించి బెనర్జీ స్పందిస్తూ.. "ఇన్నాళ్లు నటుడిగా పలు భిన్నమైన పాత్రల్లో నటించిన నేను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవడం ఆనందంగా ఉంది. భిన్నమైన కథతో యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు.
'అతడు ఆమె ప్రియుడు'లో బెనర్జీతో పాటు సునీల్, కౌశల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక యండమూరి దర్శకత్వంలో 'తులసితీర్థం' అని మరో సినిమా కూడా రూపొందనుంది. ప్రస్తుతం ఈ సినిమా కథా చర్చలు జరుగుతున్నాయి.
![]() |
![]() |