![]() |
![]() |
.jpg)
కిందపడ్డాననీ, ఒక చిన్న ఫ్రాక్చర్ అయ్యిందనీ నటుడు ప్రకాశ్‌రాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా మంగళవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని సన్‌షైన్ హాస్పిటల్‌లో సర్జరీ చేయించుకోనున్నారు. తాను బాగానే ఉన్నాననీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ ఆయన తెలిపారు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన మణిరత్నం వెబ్ సిరీస్ నవరసలో తొలి సెగ్మెంట్ ఎదిరి (ఎనిమీ)లో ఆయన ఒక ప్రధాన పాత్రలో కనిపించారు.
ఇటీవల ధనుష్ లేటెస్ట్ ఫిల్మ్ తిరుచిత్రాంబలమ్‌లో ఒక కీలక పాత్రకు ప్రకాశ్‌రాజ్ ఆగస్ట్ 5న చెన్నైలో జరిగిన ఆ సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చెన్నైలోనే జరుగుతోంది. తనకు ఎక్కడ ప్రమాదం జరిగిందనే విషయం కానీ, శరీరంలో ఎక్కడ ఫ్రాక్చర్ అయ్యిందనే విషయం కానీ ప్రకాశ్‌రాజ్ వెల్లడించలేదు.
"చిన్నగా కిందపడ్డాను. ఒక చిన్న ఫ్రాక్చర్ అయ్యింది. సర్జరీ కోసం నా ఫ్రెండ్ డాక్టర్ గురువారెడ్డి సురక్షిత చేతుల్లోకి హైదరాబాద్‌కు వెళ్తున్నా. నాకు బాగానే ఉంది. వర్రీ అవ్వాల్సిన పనిలేదు. మీ ఆలోచనల్లో నన్ను ఉండనివ్వండి" అని ట్వీట్ చేశారు ప్రకాశ్‌రాజ్.

ఆయన త్వరగా కోలుకోవాలని బండ్ల గణేశ్ సహా పలువురు సెలబ్రిటీలు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఆకాంక్షిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు.
![]() |
![]() |