![]() |
![]() |
.jpg)
"నా జీవితంలో ఇంత డబ్బు, ఇంత పేరు వస్తుందని కలలో కూడా నేనెప్పుడూ ఊహించలేదు" అంటోంది సమంత. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో రాజీగా ప్రదర్శించిన అభినయం సమంతకు దేశవ్యాప్తంగా అమిత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. ఇంతదాకా చేసిన సినిమాలకు మించి విమర్శకులు ఆమె నటనను కొనియాడారు.
ప్రస్తుతం సమంత తెలుగులో గుణశేఖర్ మాగ్నమ్ ఓపస్ 'శాంకుతలం'లో శకుంతల పాత్రను పోషిస్తోంది. అలాగే తమిళంలో నయనతారతో స్క్రీన్ షేర్ చేసుకుంటూ 'కాదువాకుల రెండు కాదల్' సినిమా చేస్తోంది. త్వరలో మరో వెబ్ సిరీస్ చేయనున్నదంటూ ప్రచారం జరుగుతోంది.
"నాకు దేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా ఉన్నాయి. నేను ఇవాళ ఇంతెత్తుకు ఎదిగానంటే అందుకు కారణం దేవుడే. నన్ను హీరోయిన్‌ను చేసిందీ, ఇవాళ ఈ స్థాయిలో ఉంచుతోందీ ఆయనే. నాకు ఎంతోమంది అభిమానులను ఇచ్చాడు. నేను సాధారణ మధ్యతరగతి నుంచి వచ్చాను. చిన్నప్పుడు చాలా మందిలాగానే ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందుకే నాకు కష్టసుఖాల విలువ తెలుసు. కాస్త ఊహ తెలిసినప్పట్నుంచీ నాకు సామాజిక సేవ అంటే ఇష్టం. ఈ అలవాటు నాకు మా అమ్మ దగ్గర్నుంచి వచ్చింది." అని చెప్పింది సమంత.
![]() |
![]() |