![]() |
![]() |

'మా' ఎన్నికలు టాలీవుడ్ లో హీట్ ని పెంచాయి. సినీ ప్రముఖులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కి వ్యతిరేకంగా నటి హేమ వాయిస్ మెసేజ్ పంపడం.. దానికి కౌంటర్ గా నరేష్, జీవిత లు ఫైర్ అవ్వడం రసాబాసగా మారింది. ఈ క్రమంలో 'మా' వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి రంగంలోకి దిగారు.
'మా' లో జరుగుతున్న పరిణామాలు.. ఎన్నికల పేరుతో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవటంపై చిరు ఫైర్ అయ్యారు. దీనికి కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. 'మా' క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు ఆయన లేఖ రాసారు. మా ఎన్నికలు వెంటనే జరపాలని చిరంజీవి లేఖలో కోరారు. కొత్త కమిటీ ఏర్పాటు కాకపోవటం వల్ల పలు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 'మా' ఎన్నికలపై అనేక మంది సభ్యులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని.. దీని వల్ల 'మా' ప్రతిష్ట మసకబారుతోందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వెంటనే జరపకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశముందని.. ఈ నేపథ్యంలో వెంటనే ఎన్నికలు జరిపేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజును కోరారు.
అలాగే 'మా' ప్రతిష్టను దెబ్బ తీస్తున్న వారిని ఎవరినీ ఉపేక్షించవద్దు.. వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోండి అని చిరు లేఖలో పేర్కొన్నారు. 'మా' ఎన్నికల వ్యవహారంలో చిరు లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
![]() |
![]() |