![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అతడు(2005), ఖలేజా(2010) చిత్రాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో దాదాపు 11 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు(ఆగష్టు 9) మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను మూవీ టీమ్ పంచుకుంది.
మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాకు సంబంధించి హీరోయిన్ తో పాటు సాంకేతిక నిపుణుల వివరాలు వీడియో రూపంలో తెలియజేసింది మూవీ టీమ్. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. గతంలో మహేష్- పూజా కాంబినేషన్ లో 'మహర్షి' సినిమా వచ్చింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజకిది మూడో సినిమా. అరవింద సమేత, అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ వరుసగా మూడో సినిమాలోనూ పూజనే హీరోయిన్ గా తీసుకోవడం విశేషం. ఇక ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నాడు. త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్ లో కూడా వరుసగా ఇది మూడో సినిమా కావడం విశేషం. మరి ఈ 3 సెంటిమెంట్ తో త్రివిక్రమ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
ఈ సినిమాకు ఆర్ట్ డైరక్టర్‌గా ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్‌గా నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్‌గా మది వర్క్ చేయనున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. కాగా మహేష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |