![]() |
![]() |
.jpg)
రష్మిక ప్రస్తుతం తన కెరీర్‌లో పీక్ స్టేజ్‌లో ఉంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌తో 'పుష్ప', శర్వానంద్‌తో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలు చేస్తోంది ఈ బెంగళూరు బ్యూటీ. ఇక హిందీలో అయితే అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై', సిద్ధార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను' సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
ఓవైపు కొవిడ్ మహమ్మారి చెలరేగుతూనే ఉండగా, హైదరాబాద్, చెన్నై, ముంబై మధ్య చక్కర్లు కొడుతోంది రష్మిక. కానీ బెంగళూరులో తల్లిదండ్రులతో గడపడానికి ఆమెకు టైమ్ దొరకడం లేదు. దీంతో కూతురి విషయంలో వారు అప్సెట్ అవుతున్నారు. ఈ సంక్లిష్ట కాలంలో కూతురు ఎక్కడ అనారోగ్యం బారిన పడుతుందోనని వారు వర్రీ అవుతున్నారు.
రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్నే వెల్లడించింది రష్మిక. కరోనా మహమ్మారి టైమ్‌లో తను ఎక్కువగా ప్రయాణాలు చెయ్యడం వాళ్లకు ఇష్టం లేదని ఆమె చెప్పింది. "పలు సినిమాల షూటింగులలో నేను పాల్గొంటూవుండటం వారిని బాధపెడుతోంది. తల్లితండ్రులుగా వారు నాపై చూపిస్తున్న శ్రద్ధకు ఆనందంగా అనిపిస్తోంది. కానీ షూటింగ్‌లను పోస్ట్‌పోన్ చేయడం నా చేతుల్లో లేదు కదా." అంది రష్మిక.
"షూటింగ్స్ పోస్ట్‌పోన్ అయితే చాలా ఇబ్బందులు ఉంటాయి. పని నుంచి నేను తప్పించుకోను. అందుకే సాధ్యమైంత సేఫ్‌గా ఉండటానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా." అని చెప్పింది నేషనల్ క్రష్.
![]() |
![]() |