![]() |
![]() |

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన `నాంది` చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు `అల్లరి` నరేశ్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ `సభకు నమస్కారం` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. సతీశ్ మల్లంపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నాడు. నరేశ్ 58వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని అతని బర్త్ డే స్పెషల్ గా జూన్ 30న రిలీజ్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఓ యంగ్ హీరో నటించనున్నాడని సమాచారం. కాగా, తాజాగా ఈ పాత్రకి `అందాల రాక్షసి` ఫేమ్ నవీన్ చంద్ర ఎంపికయ్యాడని తెలిసింది. నరేశ్ తరువాత సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇదేనని వినికిడి. అలాగే నరేశ్, నవీన్ పాత్రలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఉంటాయని బజ్. త్వరలోనే `సభకు నమస్కారం`లో నవీన్ చంద్ర ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా, నవీన్ చేతిలో ప్రస్తుతం `గని`, `విరాట పర్వం` చిత్రాలున్నాయి. ఈ రెండింటిలోనూ అభినయానికి అవకాశమున్న కీలక పాత్రల్లో కనిపించనున్నాడు నవీన్.
![]() |
![]() |