![]() |
![]() |

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న తాప్సీ.. స్వల్ప విరామం అనంతరం మరో ఆసక్తికరమైన తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమానే.. `మిషన్ ఇంపాజిబుల్`. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది యూనిట్.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో తాప్సీ పోషిస్తున్న పాత్ర, స్టోరీలైన్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే.. ఇందులో తాప్సీ డేరింగ్ జర్నలిస్ట్ గా దర్శనమివ్వనుందట. ఇక కథ విషయానికి వస్తే.. తిరుపతి నేపథ్యంలో కిరాయిహత్యల చుట్టూ తిరిగే సినిమా ఇదని సమాచారం. ఆ హత్యలకు కారకులైన వారిని పట్టించే జర్నలిస్ట్ గా తాప్సీ నటన సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే `మిషన్ ఇంపాజిబుల్`లో తాప్సీ పాత్ర, కథ గురించి వస్తున్న వార్తల్లో వాస్తవమెంతో తెలుస్తుంది.
కాగా, ప్రస్తుతం తాప్సీ చేతిలో ఐదు హిందీ సినిమాలు, మూడు తమిళ చిత్రాలున్నాయి. వీటన్నింటిలోనూ తాప్సీ అభినయానికి ఆస్కారమున్న భూమికల్లోనే కనిపించనుంది.
![]() |
![]() |