![]() |
![]() |

యూత్ స్టార్ నితిన్ నటించిన `లై` (2017) చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మేఘా ఆకాశ్. ఆ సినిమా విడుదలకు ముందే `ఛల్ మోహన్ రంగ`(2018)లోనూ ఆమెకే నాయికగా ఛాన్సిచ్చాడు నితిన్. అయితే, చెప్పుకోదగ్గ అంచనాల మధ్య విడుదలైన ఈ రెండు చిత్రాలు కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. కట్ చేస్తే.. స్వల్ప విరామం అనంతరం నితిన్, మేఘ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `నా పేరు సూర్య` ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఇద్దరు నాయికలకు స్థానముందట. వారిలో ఒకరిగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే పేరు ప్రచారంలో ఉంది. కాగా, తాజాగా సెకండ్ లీడ్ గా మేఘా ఆకాశ్ ని ఎంపిక చేశారని టాక్. త్వరలోనే నితిన్ - వక్కంతం వంశీ కాంబినేషన్ మూవీలో మేఘ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మేఘ చేతిలో అరడజను చిత్రాలున్నాయి. వీటిలో నాలుగు తెలుగు సినిమాలు కాగా, ఒకటి తమిళ చిత్రం. ఇంకొకటి తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న బైలింగ్వల్ మూవీ. ఇప్పటివరకు సరైన విజయం లేకపోవడంతో.. రాబోయే సినిమాలపైనే తన ఆశలను పెట్టుకుంది మేఘ.
![]() |
![]() |