![]() |
![]() |

బాహుబలి తరవాత దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ మూవీపై అంచనాలను మరింత పెంచాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్ కోసం రాజమౌళి ఓ మాస్టర్ ప్లాన్ వేసాడట.
'ఆర్ఆర్ఆర్' ప్రమోషనల్ సాంగ్ కోసం.. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ను రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి చిత్రాలకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుంటారు. 'ఆర్ఆర్ఆర్'కి కూడా ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే, ప్రమోషనల్ సాంగ్ ని అనిరుధ్ తో చేయిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన్ని రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది. ఈ పాటను ఎన్టీఆర్, చరణ్, అలియా భట్ లతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై చిత్రీకరించడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఈ ప్రమోషనల్ సాంగ్ లో అనిరుధ్ కూడా తనదైన స్టైల్లో సాంగ్ పాడుతూ స్టెప్పులేయనున్నాడట.
'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఓలీవియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |