![]() |
![]() |

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఇందులో కొమరం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నారు. అయితే ఇప్పటికే విడుదల చేసిన టీజర్ లో భీమ్ పాత్ర పోషించిన తారక్ ముస్లిం గెటప్ లో కనిపించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే అల్లూరి పాత్ర పోషిస్తున్న చరణ్ పొలీస్ గా కనిపించడంపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ గెటప్స్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు రచయిత 'ఆర్ఆర్ఆర్' విజయేంద్రప్రసాద్.
విజయేంద్రప్రసాద్ తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భీమ్ ముస్లిం యువకుడిగా మారాడానికి కారణం ఉందన్నారు. భీమ్ ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు ప్రయత్నించారని తెలిపారు. నైజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికే భీమ్ ముస్లిం యువకుడిగా మారాడని పేర్కొన్నారు. అలాగే అల్లూరి పాత్రలో నటించిన చరణ్‌ను పొలీస్ గా చూపించడానికి ఓ కారణం ఉందని, వెండితెరపై ప్రేక్షకులకు అది సర్‌ప్రైజ్ ఇస్తుందని విజయేంద్రప్రసాద్ అన్నారు.
'ఆర్ఆర్ఆర్'లో చరణ్, తారక్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఓలీవియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |