Home

»

Latest News

స్వీటీ @ స్వీట్ 16!

Jul 21, 2021 4:19PM

తెలుగునాట నాయికా ప్రాధాన్య‌మున్న చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన‌ క‌థానాయిక‌ల్లో అనుష్క శెట్టి ఒక‌రు. `అరుంధ‌తి`, `రుద్ర‌మ‌దేవి`, `భాగ‌మ‌తి` వంటి ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ స్టార్ బ్యూటీకి ఈ రోజు (జూలై 21) ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే.. ఇదే జూలై 21న ఆమె న‌టించిన మొట్ట‌మొద‌టి సినిమా రిలీజైంది. ఆ చిత్ర‌మే.. `సూప‌ర్`(2005).  

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా `ఇస్మార్ట్` డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందించిన ఈ మ్యూజిక‌ల్ యాక్ష‌న్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ అయేషా ట‌కీయా మెయిన్ లీడ్ గా న‌టించ‌గా.. అనుష్క సెకండ్ లీడ్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. పాత్ర ప‌రిధి చిన్న‌దే అయినా ఉన్నంత‌లో త‌న గ్లామ‌ర్ తో, యాక్టింగ్ స్కిల్స్ తో ఆక‌ట్టుకుంది స్వీటీ. క‌మ‌ర్షియ‌ల్ గా `సూప‌ర్` యావ‌రేజ్ గ్రాస‌ర్ గా నిలిచినా.. ఏడాది తిరిగేలోపు `విక్ర‌మార్కుడు` (2006)తో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది అనుష్క‌. నాలుగేళ్ళ‌లోపే `అరుంధ‌తి` (2009)తో స్టార్ డ‌మ్ చూసింది. ఆపై `బాహుబ‌లి` సిరీస్ (2015, 2017)తో జాతీయ స్థాయిలో గుర్తింపును పొందింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాదిలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న నాయిక‌ల్లో ఒక‌రిగా వార్త‌ల్లో నిలుస్తోందీ మంగ‌ళూరు సుంద‌రి.  

`సూప‌ర్` చిత్రం విడుద‌లై నేటికి స‌రిగ్గా ప‌ద‌హారేళ్ళు. అంటే.. నాయిక‌గా స్వీటీ స్వీట్ సిక్స్ టీన్ పూర్తిచేసుకుంద‌న్న‌మాట‌. ఈ సంద‌ర్భంగా భ‌విష్య‌త్ లో అనుష్క మ‌రెన్నో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌తో, విజ‌యాల‌తో ముందుకు సాగాల‌ని ఆశిద్దాం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com