![]() |
![]() |

మాస్ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. `భద్ర`, `తులసి`, `సింహా`, `లెజెండ్`, `సరైనోడు`.. ఇలా బోయపాటి రూపొందించిన పలు యాక్షన్ డ్రామాలు మాస్ ఆడియన్స్ ని భలేగా ఎంటర్టైన్ చేశాయి. త్వరలో తన లక్కీ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణతో కలసి `అఖండ`తో పలకరించబోతున్నాడీ స్టార్ కెప్టెన్. `సింహా`, `లెజెండ్` వంటి సెన్సేషనల్ హిట్స్ తరువాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వినాయక చవితి కానుకగా థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందని టాక్.
ఇదిలా ఉంటే.. `అఖండ` తరువాత బోయపాటి శ్రీను చేయబోయే సినిమాపై రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకవైపు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో `సరైనోడు` తరువాత మరో చిత్రం చేయబోతున్నాడనే ప్రచారం సాగుతుండగా.. మరోవైపు కోలీవుడ్ స్టార్ సూర్య తో ఓ బైలింగ్వల్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. తమిళనాట స్టార్ గా వెలుగొందుతున్న తెలుగబ్బాయ్ విశాల్ కాంబినేషన్ లో బోయపాటి తన నెక్స్ట్ వెంచర్ చేయనున్నాడట. అంతేకాదు.. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తారని బజ్. త్వరలోనే విశాల్ - బోయపాటి కాంబో మూవీపై క్లారిటీ రానుంది.
![]() |
![]() |