![]() |
![]() |

నటుడిగా బొమన్ ఇరానిది 20 ఏళ్ళ ప్రస్థానం. ఈ ప్రయాణంలో పలు విభిన్న పాత్రలు చేసి మెప్పించాడు బొమన్. మరీముఖ్యంగా.. రాజ్ కుమార్ హిరాణి రూపొందించిన `లగే రహే మున్నాభాయ్`, `త్రీ ఇడియట్స్` చిత్రాలు బొమన్ కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. తెలుగులోనూ `అత్తారింటికి దారేది`, `బెంగాల్ టైగర్`, `అజ్ఞాతవాసి`, `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో అలరించాడు బొమన్.
ఇదిలా ఉంటే.. బొమన్ ఇరాని తనయుడు కయోజ్ ఇరాని కూడా నటుడిగా `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్`(ఆలియా భట్ తొలి చిత్రం )తో సహా కొన్ని సినిమాల్లో సందడి చేశాడు. ఇక రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన ఆంథాలజీ `అజీబ్ దస్తాన్స్`లో ఓ సెగ్మెంట్ ని డైరెక్ట్ చేసి వార్తల్లో నిలిచాడు కయోజ్. కట్ చేస్తే.. త్వరలో కయోజ్ ఓ పూర్తిస్థాయి సినిమాని రూపొందించనున్నాడని సమాచారం. అంతేకాదు.. ఇందులో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నాయికగా నటించబోతోందని, ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని బజ్. త్వరలోనే జాన్వి - కయోజ్ కాంబినేషన్ ఫిల్మ్ పై క్లారిటీ రానుంది. మరి.. ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో బొమన్ ఇరాని కూడా కనిపిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |