![]() |
![]() |

అందాల తార శ్రుతీ హాసన్ ఇటీవల ఇంటికి అవసరమైన కిరాణా వస్తువుల కోసం బాయ్‌ఫ్రెండ్ శంతను హజారికా, బెస్ట్ ఫ్రెండ్ అమృతా రామ్‌తో కలిసి ముంబైలోని ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. ఇప్పుడవి ఇంటర్నెట్‌ను తుఫాన్‌లా ఊపేస్తున్నాయి. వాటిలో ఒక ఫొటోలో ఆమె శంతనును ముద్దు పెడుతూ, కావలించుకుంటూ కనిపిస్తోంది. శ్రుతి, శంతను సుమారు రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు.
అంతేకాదు, ప్రస్తుతం శంతనుతో శ్రుతి సహజీవనం చేస్తోంది. ఆ ఇద్దరూ క్లారా అనే పిల్లిని పెంచుకుంటున్నారు. ముంబైలో ఇటీవల ఓ సినిమా షూటింగ్‌ను పున్ఃప్రారంభించింది శ్రుతి. అయితే దాని వివరాలను ఆమె షేర్ చేయలేదు. శంతను, క్లారాతో తను కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ వస్తోందామె.
ఇటీవల ఆమె గ్రాసరీ షాపింగ్ కోసమని బాయ్‌ఫ్రెండ్ శంతను హజారికా, ఫ్రెండ్ అమృతా రామ్‌తో కలిసి ఒక సూపర్ మార్కెట్‌కు వెళ్లింది. ఆ పబ్లిక్ ప్లేస్‌లో శంతనును కావలించుకొని, ఒక కాలు ఎత్తిమరీ అతడిని ముద్దుపెట్టుకుంటూ కెమెరాకు పోజిచ్చింది శ్రుతి. వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. ముఖ్యంగా కాలెత్తి శంతనును ముద్దుపెట్టుకుంటున్న ఫొటో చూసి నెటిజన్లు షాకయ్యారు. పబ్లిక్ ప్లేస్‌లో ఇలా చేయడమేంటని ట్రోల్ చేస్తున్నారు. సినిమా సీన్లలో చేసినట్లు ఇలా బహిరంగంగా చేస్తే ఎలాగమ్మా?.. అని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల శ్రుతి బ్లాక్‌బస్టర్ 'క్రాక్' మూవీతో పాటు పవన్ కల్యాణ్ భార్యగా 'వకీల్ సాబ్'లో కనిపించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'సలార్'లో నటిస్తోంది. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకుడు. విజయ్ సేతుపతితో తను నటించిన 'లాబమ్' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది శ్రుతి.

![]() |
![]() |