![]() |
![]() |

రామ్ పోతినేని హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో తాజాగా విలన్ ఫైనల్ అయ్యాడు. ఇందులో యంగ్ టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టిని విలన్ గా ఎంపిక చేసారు.
రామ్-లింగుస్వామి మూవీలో తమిళ నటుడు విలన్ గా నటిస్తాడని ముందు నుంచే అంటున్నారు. ఇటీవల ఈ సినిమాలో విలన్ గా ఆర్య నటించనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ ఆదికి దక్కింది. హీరో, విలన్ అనే పరిమితులు లేకుండా విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. ముఖ్యంగా అల్లు అర్జున్- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు'లో పూర్తిస్థాయి విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు మరోసారి రామ్-లింగుస్వామి మూవీతో విలన్ గా నటించి మెప్పించడానికి సిద్ధమయ్యాడు.
సరైనోడు తర్వాత రెండోసారి పూర్తి స్థాయి విలన్ పాత్రలో నటించే అవకాశం దక్కినందుకు ఆది సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరైనోడు తర్వాత మళ్లీ విలన్ గా చేయాలంటే పాత్రలో ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాను. ఈ స్టొరీ విన్నాక ఇది నార్మల్ గా ఉండే రోల్ కాదనిపించింది. ఈ రోల్ రాయలసీమ కి చెందిన రా అండ్ రస్టిక్ రోల్. తమిళంలో మధురై బేస్ లో ఉంటుంది. సరైనోడులో స్టైలిష్ విలన్ గా చేశాక.. ఇందులో మళ్లీ విలన్ పాత్ర ఇంటరెస్టింగ్ గా అనిపించింది. రామ్, లింగుస్వామి లతో కలిసి సినిమా చేయబోతున్నందుకు హ్యాపీగా ఉంది. షూటింగ్ కోసం వేచి చూస్తున్నాను అని అన్నాడు.
![]() |
![]() |