![]() |
![]() |

అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న `బంగార్రాజు` చిత్రానికి ముహూర్తం ఫిక్సయిందా? అవుననే వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో.
ఆ వివరాల్లోకి వెళితే.. కింగ్ నాగార్జున కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా `సోగ్గాడే చిన్ని నాయనా`. 2016 సంక్రాంతికి విడుదలైన ఈ సూపర్ నేచురల్ డ్రామాకి సీక్వెల్ గా `బంగార్రాజు`ని తీసుకురాబోతున్నట్లు చాన్నాళ్ళ క్రిందటే ప్రకటించారు నాగ్. అంతేకాదు.. `సోగ్గాడే చిన్ని నాయనా` దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నే ఈ సీక్వెల్ ని రూపొందిస్తారని చెప్పుకొచ్చారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి జాప్యం జరిగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఎట్టకేలకు నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29న `బంగార్రాజు`కి శ్రీకారం చుట్టనున్నారట. అంతేకాదు.. `సోగ్గాడే చిన్ని నాయనా` తరహాలో సంక్రాంతి సీజన్ లోనే `బంగార్రాజు` కూడా విడుదల కానుందని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.
కాగా, `బంగార్రాజు`లోనూ రమ్యకృష్ణ కొనసాగనుండగా.. అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ ఇందులో ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్లు బజ్. అలాగే `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి కూడా ఇందులో నటించే అవకాశముందని ప్రచారం సాగుతోంది.
![]() |
![]() |