![]() |
![]() |

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌కు సంక్రాంతి సీజన్‌తో మంచి అనుబంధమే ఉంది. కథానాయకుడిగా రామ్ నటించిన మొదటి సినిమా 'దేవదాసు' (2006) ఈ సీజన్‌లోనే రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆపై 'మస్కా' (2009), 'నేను శైలజ' (2016)తో పాటు ప్రీవియస్ మూవీ 'రెడ్' (2021) కూడా ముగ్గుల పండగ బరిలోనే దిగాయి. వీటిలో 'నేను శైలజ' మంచి విజయం సాధించగా.. 'మస్కా', 'రెడ్' చెప్పుకోదగ్గ ఫలితాలను అందుకున్నాయి.
కట్ చేస్తే.. మరోసారి సంక్రాంతి సీజన్‌లో వినోదాలు పంచేందుకు ఈ 'ఇస్మార్ట్' హీరో సిద్ధమవుతున్నాడట. ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 2022 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది. వచ్చే సంక్రాంతికి పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు', మహేశ్ 'సర్కారువారి పాట' సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అంటే ఆ స్టార్స్‌తో రామ్ పోటీపడనున్నాడన్న మాట.
ఇదిలా ఉంటే.. రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన 'ఇస్మార్ట్ శంకర్'.. ఈ ఆదివారం (జూలై 18)తో రెండేళ్ళు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |