![]() |
![]() |

బిగ్ టికెట్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ఈ మూడు భాషల్లోనూ అగ్ర కథానాయకుల చిత్రాల్లో లీడింగ్ లేడీగా నటిస్తూ.. వార్తల్లో నిలుస్తోంది ఈ బుట్టబొమ్మ. ఒకవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా పాన్ - ఇండియా ప్రాజెక్ట్ `రాధేశ్యామ్`లో నాయికగా నటిస్తున్న పూజ.. మరోవైపు `ఆచార్య`లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో జట్టుకట్టింది. అలాగే తమిళంలో దళపతి విజయ్ కి జంటగా `బీస్ట్` చేస్తోంది. అదేవిధంగా హిందీ విషయానికి వస్తే.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన `భాయ్ జాన్`లో ఆడిపాడనుంది.
ఇలా.. బిజీబిజీగా గడిపేస్తున్న పూజ.. తాజాగా మరో పాన్ - ఇండియా వెంచర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ సినిమా మరేదో కాదు.. `ఎన్టీఆర్ 30`. `జనతా గ్యారేజ్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా కోసం తొలుత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు వినిపించినా.. ఇప్పుడా అవకాశం పూజకి దక్కిందని సమాచారం. అంతేకాదు.. కేవలం గ్లామర్ కే పరిమితం కాకుండా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్ ఇదని బజ్. త్వరలోనే `ఎన్టీఆర్ 30`లో పూజ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. `అరవింద సమేత` తరువాత తారక్ తో.. `ఆచార్య` అనంతరం కొరటాల కాంబోలో పూజ చేయనున్న ఈ సినిమా తనకి ఎలాంటి గుర్తింపు తీసుకువస్తుందో చూడాలి.
![]() |
![]() |