![]() |
![]() |

`శహ్‌జాదా`.. 50 ఏళ్ళ క్రితం హిందీనాట మంచి విజయం సాధించిన చిత్రమిది. రాజేశ్ ఖన్నా, రాఖీ జంటగా నటించిన ఈ పాపులర్ సినిమా టైటిల్ తో త్వరలో బాలీవుడ్ లో మరో సినిమా రాబోతోంది. విశేషమేమిటంటే.. నాటి `శహ్‌జాదా` ఎలాగైతే ఓ దక్షిణాది సినిమా (తమిళ చిత్రం `ఇదు సత్యం`)కి రీమేక్ మూవీనో.. అలాగే రానున్న `శహ్‌జాదా` కూడా మరో సౌత్ ఇండియన్ ఫిల్మ్ కి రీమేక్ వెర్షన్.
ఆ వివరాల్లోకి వెళితే.. తెలుగునాట ఘనవిజయం సాధించిన `అల వైకుంఠపురములో` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించనున్న ఈ సినిమాకి `శహ్‌జాదా` అనే పేరుని ఫిక్స్ చేశారని టాక్. అంతేకాదు.. మాతృకలో కథానాయకుడిగా నటించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ రీమేక్ లో అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నారని వినిపిస్తోంది. త్వరలోనే `శహ్‌జాదా`లో బన్నీ స్పెషల్ రోల్ పై క్లారిటీ రానుంది.
మరి.. క్లాసిక్ టైటిల్ తో సెన్సేషనల్ మూవీకి రీమేక్ గా రాబోతున్న ఈ కార్తిక్ - కృతి స్టారర్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
![]() |
![]() |