![]() |
![]() |

రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం 'కేజీఎఫ్ చాప్టర్ 2'. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజాగా ఈ సినిమా టీజర్ మరో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.
హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జనవరిలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ టీజర్ 200 మిలియన్ మార్క్ ని దాటింది. లాగే ఈ టీజర్‌కు 8.4 మిలియన్ లైక్స్, 1.1 మిలియన్ కు పైగా కామెంట్స్ వచ్చాయి. ఇండియన్ సినీ హిస్టరీలో మరే సినిమాకు రాని విధంగా కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ కి 200 మిలియన్ వ్యూస్ రావడం బట్టి చూస్తుంటే సినిమాపై ఏ రేంజ్ లో హైప్ ఉందో అర్థమవుతోంది.
యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' 2018 డిసెంబర్ లో ఐదు భాషల్లో విడుదలై సంచనాలు సృష్టించింది. 'కేజీఎఫ్ చాప్టర్ 1' కి కొనసాగింపుగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' వస్తుంది. అందుకే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశముంది.
![]() |
![]() |